Thursday, January 21, 2016

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం- ఆరోగ్యంగా జీవిద్దాం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం- ఆరోగ్యంగా జీవిద్దాం ( స్వచ్ఛ భారత్ ):

                    మన చుట్టుపక్కన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం,ఆరోగ్యంగా జీవిద్దాం. మన ప్రాంతంలో చాలా మంది చెత్తా, చెదారం ఎక్కడపడితే అక్కడే పడేస్తుంటారు. అలా పడెయ్యకూడదు. అలా  చెత్త ఎక్కడ పడితే అక్కడ పడెయ్యడం వల్ల ఆ చెత్త క్రుళ్ళి పోయి చెడు వాసన వస్తుంది. అది అందరికి ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాక ఆ చెడు వాసనాతో కూడిన గాలిలో అనేక క్రిములు వ్యాపించి, ఆ చుట్టుపక్కన ఉన్నవారు అనారోగ్యం పాలు అవుతారు.
          
                  మనం పడవేసిన ఆ చెత్త అనేక రకాల దోమలు, క్రిములు మరియు పందులకు నిలయంగా మారి, వాటి ద్వారా అంటే దోమ కాటు వల్ల  అనారోగ్యం పాలు  కావడం కాయం. ఉదా : మలేరియా, డెంగ్యు , పిలేరియా ......
లాంటి విష జ్వరాల బారిన పడుతారు. అలాగే పందులపై  వాలిన దోమలు మనుషులను కుట్టడం ద్వారా మెదడు వాపు లాంటి ప్రమాదకర రోగాలు వస్తాయి. so  ప్రతి వొక్కరు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎంతో మంచిది.  

Follow my blog to transform your handwriting into beautiful calligraphy

 Hello Friends,          Hope you all are doing and fine. I am good by the Grace of God and by all of your prayers and blessing. I'm hap...