Sunday, October 4, 2015

చెట్లను నాటండి -పర్యావరణాన్ని కాపాడండి.

చెట్లను  నాటండి  -పర్యావరణాన్ని కాపాడండి-ఉచితంగా  ప్రాణవాయువును (ఆక్షీజన్ ) ను పొందండి.
 SAVE TREES-SAVE ENVIRONMENT-GET OXYGEN FREE

చెట్లు జీవి మనుగడకు ఎంతగానో ఉపయోగపడతాయి. చెట్ల ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి.

Image credits:https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgf9rA28dPp2jg_EwohG4UOBp1HB2mFS_Wnb5UuH9mFTJS7kyb9rp6jqzp4S9vY2ifdjaLqdMX7XHnlu6yYC_THg2kT78nWbLrb9GFkCwuJSliID4CcCwIRFGz4QuKczbTXb5G0zVdt6dA9/s1600/HDHuT.BlogSpot.com+%25281%2529.jpg
చెట్ల ద్వారా మనకు ఆక్షీజన్ లభిస్తుంది, పండ్లు, పువ్వులు మరియు చెట్ల కాండం తో మనం వివిధ రకాల గ్రుహోపకరనాలను తయారుచేసుకోవచ్చు.
 చెట్లు మనకు అన్ని ఇవ్వడమే మనం చూస్తుంటాం కాని చెట్లకు మనం ఏం చేస్తున్నాం ఒక్క సారి ఆలోచించండి!
                                         Image credits:http://cache.pakistantoday.com.pk/2012/01/Let-car11.jpg
చాలా మంది చెట్లను నరుకుతున్నారే తప్ప చెట్లను నాటడం లేదు ఎందుకు? ఒక్క సారి ఆలోచించాలి.
చెట్లను నరుకుతూ పోతే ఈ భూమి వేడెక్కి రానురాను ఎడారిలా మారిపోతుంది. నీటి కొరత ఏర్పడుతుంది. వర్షాలు కురువవు, ఎండ తీవ్రత ఎక్కువవుతుంది. జీవి మనుగడ కష్టతరం అవుతుంది.  


                                                       Image credits:http://dreamatico.com/data_images/desert/desert-1.jpg
కాబట్టి మనమంతా ఒక్క సారి ఆలోచిద్దాం మన  పర్యావరణాన్ని కాపాడుకుందాం.
మొక్కలను నాటుదాం-చెట్లను పెంచుదాం-పర్యావరణాన్ని కాపాడుదాం. తద్వారా వచ్చే ఫలాలను అనుభవిద్దాం. 
చెట్టు నుండి వచ్చే ప్రతీది  మనకు ఎంతగానో  ఉపయోగపడుతుంది. ఉదా: సుగంధం పరిమళం వెదజల్లే పువ్వులు,తియ్యని ఫలాలు, కలప, వంట చెరుకు, ......... మొదలగునవి. 
కావున చెట్లను నరికివేయడం ఆపుదాం. ఒక వేల నరికినా దాని స్థానంలో మళ్లీ 2 లేదా అంతకన్నా ఎక్కువ మొక్కలను నాటుదాం. 
     మన చేతులారా మన పర్యావరణాన్ని పాడుచేసుకోవద్దు. 
మొక్కలను నాటుదాం-చెట్లను పెంచుదాం-పర్యావరణాన్ని కాపాడుదాం. తద్వారా వచ్చే ఫలాలను మనమే అనుభవిద్దాం.
                                                                                                                      ధన్యవాదములు. 
                                                                                                                  మీ  పర్యావరణ  ప్రియుడు


<script>
  (function(i,s,o,g,r,a,m){i['GoogleAnalyticsObject']=r;i[r]=i[r]||function(){
  (i[r].q=i[r].q||[]).push(arguments)},i[r].l=1*new Date();a=s.createElement(o),
  m=s.getElementsByTagName(o)[0];a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)
  })(window,document,'script','//www.google-analytics.com/analytics.js','ga');

  ga('create', 'UA-68278495-1', 'auto');
  ga('send', 'pageview');

</script>





No comments:

Post a Comment

Follow my blog to transform your handwriting into beautiful calligraphy

 Hello Friends,          Hope you all are doing and fine. I am good by the Grace of God and by all of your prayers and blessing. I'm hap...